జగన్ ఒక వెధవ ..ఐయామ్ సారీ అది కూడా తక్కువే..

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. విషయం ఏదైనా కానీ మనసులో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయనకు అలవాటు. మొదట్లో నోరు జారడం, ఆ తర్వాత సారీ చెప్పడం ఆయనకు ఆది నుంచి అలవాటే. తాజాగా అనంతపురంలో జరిగిన నీరు-మీరు సభలో జేసీ మాట్లాడారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగుడుతూనే మరోవైపు జగన్‌ని దుమ్మెత్తిపోశారు. జగన్ రాజకీయాలకు పనికిరాడని, అసమర్థుడని..ఆయన వల్ల ఏమీ కాదని..అందుకనే మొదట్లో వైసీపీలోకి వెళదామనిపించి బాగా ఆలోచించానని కానీ జగన్ గురించి బాగా అర్థమై టీడీపీలో చేరానన్నారు.

 

చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసునని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమన్నారు..నాకూ కొంచెం కులం పిచ్చి ఉంది..అందుకే జగన్మోహన రెడ్డితో నడవాలని అనుకున్నా. ఎంత కుల పిచ్చి ఉన్నా ఇతర కులాల వారిని ద్వేషించేవాడిని మాత్రం కాదు. కానీ ఏం చేస్తాడు జగన్..ఏం చేయలేడు..వాడు వెధవ..ఐయామ్ సారీ, వెధవ అనే మాట కూడా తప్పేమో..ఆ మాటను ఉపసంహరించుకుంటున్నా.

 

చంద్రబాబు ఎక్కువగా కలలు కంటారు. సీఎంగారు ఎలాగూ 2019లో పోలవారాన్ని పూర్తి చేస్తారు. నిన్న మీరు కల కన్నారా... మొన్న ఒక మిషన్ రూ. 80 కోట్లు ఖర్చుపెడితే నాశనం అయింది. దాన్ని తెప్పించాలంటే మీకు మూడు, నాలుగు మాసాలు పడుతుందన్నారు. నేను ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు ఒక్కటే చెప్పదలచుకున్నా.. చంద్రబాబు చాలా కలలు కంటున్నారు. ఆయన కలలు నెరవేరాలంటే మనమందరమూ మన బాగుకోసం, మన పిల్లల కోసం ఆయనను సీఎంగా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జగన్ పార్టీ నేతలు జేసీపై గుర్రుగా ఉన్నారు.