ఆ ఇద్దరూ సీఎం కావాలని కోరుకుంటున్నారు..!


వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లపై టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.... జగన్మోహన్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ను కలపాలని ఢిల్లీలో కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ, ఆ ఇద్దరు నాయకులూ సీఎం కావాలని కోరుకుంటున్నారని, దీంతో ఢిల్లీ పెద్దలు చేసే ప్రయత్నాలు సఫలం కావని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై విచారణ జరపాలని కొందరు అంటున్నారని, వారు ఏం అవినీతి చేశారని విచారణ జరుపుతారని నిలదీశారు. వైఎస్సార్‌ హయాంలో కూడా చంద్రబాబుపై విచారణ జరిపారని, కానీ ఏమీ చేయలేకపోయారని అన్నారు.