టీడీపీ,బీజేపీ పొత్తుపై జేసీ జోస్యం....

 

తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెబుతుంటారు. ప్రతిపక్షపార్టీ అయినా, తన సొంత పార్టీ అయినా సరే ఏ విషయాన్నైనా మొహం మీదే చెబుతారు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య పొత్తుపై స్పందించారు. ఇరు పార్టీల మధ్య ఉన్న పొత్తు, రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని...చంద్రబాబు కార్యసాధకుడని కితాబిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవన్నీ ఆయన సాధించుకుంటారని చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. మిడిమిడి జ్ఞానంతో కొంతమంది టీడీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని అన్నారు.