రాయలసీమలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...

 

ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంలో 'అనంతపురం' పార్లమెంట్‌ సభ్యుడు జె.సి.దివాకర్‌రెడ్డి దిట్ట. విషయం ఏదైనా కానీ.. నిర్మొహమాటంగా చెపుతుంటాడు. అది స్వంత విషయమైనా..పార్టీ విషయమైనా..ప్రతిపక్షానికి సంబంధించిన విషయమైనా. ఎవరు ఏమనుకున్నా...ఆయన పట్టించుకోరు.. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పారు దివాకర్ రెడ్డి. 'రాయలసీమ'లో వై.ఎస్‌.జగన్‌ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఆపార్టీ బాగా బలహీనపడిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...సీమలో తెలుగుదేశం పార్టీ 43 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..టిడిపికి తాను చెప్పిన దానికంటే ఒకటి రెండు ఎక్కువే వస్తాయని 'దివాకర్‌రెడ్డి' బల్లగుద్ది చెపుతున్నారు. దీనికి కారణం...రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన 'టిడిపి' ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉండటమేనట. కొంత మంది కులమేదేతై తమకెందుకు..తమ కష్టాలు తీర్చిన 'చంద్రబాబు'కే ఓటు వేస్తామని చెబుతున్నారట.