దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు... వైసీపీ ఎమ్మెల్యే పై జేసీ ఫైర్..

Publish Date:Jan 11, 2017

 

వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క‌డ‌ప‌ జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ దివారకర్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. ఈసందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ "ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు" అంటూ నిప్పులు చెరిగారు. ఎవడో చెప్పిన మాటలు విని, నన్నే కామెంట్ చేస్తావా? అంటూ మండిపడ్డారు. నన్ను జానీవాకర్ అంటాడా..మద్యం తాగడం తమ ఇంటావంటా లేదని.. తన గురించి మాట్లాడిన వారే జానీవాకర్లు అంటూ మండిపడ్డారు. ఏడవ తరగతి ఫెయిల్ అయిన వాడికి తాడిపత్రి ఇన్ ఛార్జ్ పదవి కట్టబెట్టారు అని ఎద్దేవ చేశారు. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుతోనే ఉంటానని.. ఈసారి పులివెందులలో టీడీపీ అభ్యర్ధిని గెలిపించుకుందామని తెలిపారు.  కాగా నోటికొచ్చినట్టు మాట్లాడితే దివాకర్ రెడ్డి నాలుక కోస్తానని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే.

By
en-us Politics News -