జయలలిత తల్లే చంపేసింది....

 

జయలలిత బ్రతికిఉన్నంతకాలం ఆమె జీవితం ఓ రహస్యంగానే గడిచింది. ఇప్పుడు మరణానంతరం కూడా ఆమె జీవితంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మరణానంతరం కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆమె కూతురు విషయంలో తమిళనాడులో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. అమృత అనే మహిళ తాను జయలలిత కూతురినని సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అందరూ ముందు షాకైనా.. ఆ తరువాత ఒక్కొక్కటిగా వస్తున్న వార్తలు వింటే.. నిజంగా ఈమె జయలలిత కూతురేమేమో అని అనుకుంటున్నారు. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జయ స్నేహితురాలు గీత అనే మహిళ కూడా... శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు జయకు తనకు ఒక కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని ఆమె అన్నారు. ఆమె పేరు అమృత అని కూడా చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే ఆసక్తికర చర్చలు జరుగుతుంటే.. మరో సంచలన విషయాన్ని ఆమె అత్త లలిత వెలుగులోకి తెచ్చారు. అదేంటంటే..జయలలిత తండ్రిని ఆమె తల్లే చంపినట్టు. జయలలిత తండ్రి జయరామన్ మద్యానికి బానిస కావడంతో, తల్లి సంధ్యే స్వయంగా విషమిచ్చి చంపిందని ఓ మీడియా ఛానల్ లో ఆమె తెలిపారు. జయరామన్ హత్య తరువాత ఆమె ఈగోను భరించలేక తాము ఆమెకు దూరంగా వెళ్లిపోయామని, ఆ తరువాత జయ ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళ్లిందని అన్నారు.

 

అంతేకాదు ఇంకా జయలలిత గురించి మాట్లాడుతూ...జయకు కాన్పు చేసింది తన పెద్దమ్మేనని, అయితే, పుట్టిన బిడ్డ అమృతేనని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేవని అన్నారు. తనకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ఒట్టు వేయించుకుందని లలిత వెల్లడించారు. మరి అసలు జయలలిత కూతురు ఎవరు...? అమృతనే జయలలిత కూతురా...కాదా..? ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయో చూద్దాం...