తోటి జవాన్లపై సహా జవాను కాల్పులు..

Publish Date:Jan 12, 2017

 

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ జవాను.. తన తోటి జవాన్లపైనే కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ జవాన్ కోపంతో త‌న స‌హ‌చ‌ర జ‌వాన్ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో న‌లుగురు సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరోఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  గాయాల‌పాల‌యిన వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి తీసుకెళుతున్న‌ట్లు తెలుస్తోంది. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

By
en-us Politics News -