ఉద్రిక్తంగా జాట్ల ఆందోళన

తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు చేస్తోన్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రిజర్వేషన్ల కోసం రేపు పార్లమెంటును ఘెరావ్ చేయాలని జాట్ నాయకులు పిలుపు నివ్వడంతో పెద్ద ఎత్తున జాట్ వర్గీయులు సిర్సా-హిస్సార్ ఢిల్లీ నేషనల్ హైవే మీదుగా ట్రాక్టర్లలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆందోళనకారులు వారిపైకి రాళ్లు రువ్వారు. దీంతో నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో డీఎస్పీతో పాటు ముగ్గురు పోలీసులు, పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. రెండు బస్సులు ధ్వంసమైనట్లు సమాచారం. మరోవైపు రేపటి జాట్ల పార్లమెంట్ ఘెరావ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. హరియాణాలోని దాదాపు 15 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.