వారానికోసారి జనతా కర్ఫ్యూ వుంటే ఆలోచించండి!

నేరాలు లేవు. రోగాలు లేవు. రోడ్డు ప్రమాదాలు లేవు.

కోట్ల కొలది డబ్బు తగలబడి పోవడానికి కారణమైన పానీ పూరీ బండ్లు లేవు. బేకరీలు లేవు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేవు. హోటల్స్, రెస్టారెంట్ లు లేవు.. పబ్స్ లేవు...బార్ లు లేవు.

ఇంటివద్దనే హ్యాపీ గా కుటుంబ సమేతంగా ఇంటి వంట ను తింటూ ఉంటున్నారు. పోలీస్ మొత్తం లాక్ డౌన్ అదుపుకోసం రోడ్లపైనే. డాక్టర్స్ మొత్తం కరోనా అదుపు కోసం పోరాటం లోనే.

ఎప్పుడూ కిక్కిరిసి ఉండే ప్రైవేట్ ఆసుపత్రులు, ఒక్క క్షణం తీరిక లేకుండా ఉండ్ పోలీస్ స్టేషన్ లు ఇప్పుడు ఇలాంటి మార్పుతో ఉండటం నిజంగా ఆలోచించాల్సిన విషయం.

అభివృధికి ఢోకా లేకుండా, ఆరోగ్య భద్రత కాపాడుతూ, ఉండే ఇలాంటి సమాజం అవసరమని అనుకోవచ్చా!? వీటిని దృష్టి లో పెట్టుకొని ఇంకేదైనా మార్పుతో కూడిన సమాజం కోసం సోషలిస్ట్ ఆలోచనలు తీసుకుంటే ఎలా ఉంటుంది!?

వారానికోసారి తప్పకుండా జనతా కర్ఫ్యూ బాగుంటుందా!? ఇలా పలు రకాల ఆలోచనలు చేస్తే ఎలా ఉంటుంది!? ఏమో...