జనసైనికులకి శుభవార్త.. సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్

ఎప్పుడెప్పుడు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుందామా అని ఎదురుచూస్తోన్న పవన్‌ అభిమానులకి శుభవార్త. జనసేనపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తొలి సభ్యత్వాన్ని పవన్ స్వీకరించారు. అనంతరం, తమ పార్టీలోని ముఖ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. రెండు రాష్ట్రాల్లో త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని.. గత పదేళ్లుగా తనను అనుసరిస్తున్న వారితో మూడు రోజులుగా పవన్ సమావేశమయ్యారని.. పార్టీ ఆశయాలు, సిద్దాంతాలను వారికి వివరించినట్లు జనసేన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో కంటెంట్ రైటర్స్, అనలిస్టులు, సమన్వయకర్తలుగా పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారిలో మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో ఓ వర్క్‌షాప్ జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపింది.