జగన్,పవన్..మధ్యవర్తి కేసీఆర్

 

ప్రశ్నించటానికే పార్టీ పెట్టా అన్నాడు..సినిమాలు చేసుకుంటున్నాడు...ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు గంటో అరగంటో మాట్లాడి వెళ్ళిపోతాడు..మళ్ళీ ఎప్పుడు కనపడతాడో కూడా తెలియదు..ఇది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి. అన్ని రోజులు ఒకేలా ఉండవుగా..ఇప్పుడు పరిస్థితి మారింది... ఆయన కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలా మారిపోయారు.. సభలు,సమావేశాలతో బిజీ అయ్యారు..ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ పార్టీలు మాత్రం అసలు పవన్ వ్యాఖ్యలను పట్టించుకొనే అవసరం లేదు..ఆ పార్టీ కి పెద్ద బలం ఏముంది అని బహిరంగంగానే ప్రకటించేస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తా అంటున్నాడు..వీళ్ళేమో ఎప్పటినుంచో పాతుకుపోయి ఉన్న పార్టీలు ఈ పరిస్థితుల్లో అసలు పవన్ ఎలా నెట్టుకొస్తాడా అనుకుంటున్నారు. కానీ పవన్ కి ఓ పార్టీ నుంచి పొత్తు కోసం ఆహ్వానం వచ్చిందట. వైసీపీ నుంచి ఆ పార్టీకి రాయబారం అందిట. ఇది స్వయంగా పవన్ చెప్పిన మాటే.. అయితే వీరిద్దరి మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది టీఆర్ఎస్. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని కేసీఆర్ అన్న మాట అందరికి గుర్తుండే ఉంటది. ఆ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబును ఓడించటమేనట. అందుకు తగ్గట్టు గా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్,పవన్ పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఇబ్బందికరం అని.. విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తుంది. అందుకే వీరిద్దరిని కలిపే భాద్యత ఆయన మీదేసుకున్నారని సమాచారం. 

జగన్‌తో పవన్ కల్యాణ్ కలుస్తారో లేదో కానీ వారిద్దిరి మధ్య పొత్తుల కోసం చాలా తీవ్రమైన ప్రయత్నలే జరుగుతున్న విషయం మాత్రం పవన్ మాటల ద్వారా తేలిపోయింది. గతంలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరిగాయన్న వ్యాఖ్యలు టీడీపీ నేతలు చేశారు. కానీ ఈ వార్తలను ఆయా పార్టీలు ఖండించాయి.ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందని పవన్ వ్యాఖ్యల ద్వారా బయటకు రావడం కలకలం రేపుతోంది.