పవన్ విషయంలో ఏం చేద్దాం...!

 

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలపై పోరాడేందుకు గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి.. నిజాలు బయటకు తేవాలని చూస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఆయన ఇప్పటికే లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను కలవడం జరిగింది. ఇక నిన్న రాజకీయవేత్త అయిన ఉండవల్లిని కూడా జరగడం జరిగింది. అయితే మొన్నటి వరకూ పవన్ పై కాస్త అటూ, ఇటూగా ఉన్న ఉండవల్లి ఇప్పుడు పవన్ కి ఫిదా అయినట్టే కనిపిస్తోంది. చూద్దాం, చూద్దాంలే అని అన్న ఉండవల్లి..పవన్ అప్రోచ్ తనకు నచ్చిందని.. తన విధానాలు నచ్చాయని చెప్పడంతో పవన్ తో కలిసి పనిచేసేందుకు ఉండవల్లి సిద్దంగా ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

 

అంతేకాదు దీనిపై జయప్రకాశ్ నారాయణతో చర్చించాలని కూడా ఉండవల్లి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్ తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయింకున్నట్టు తెలుస్తోంది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తరువాతనే జేఏసీలో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

 

మరి జేపీ, ఉండవల్లి మాటలను బట్టి చూస్తే పవన్ మీద పాజిటివ్ ఒపినీయన్ తోనే ఉండట్టు తెలస్తోంది. అయితే పాజిటివ్ గా ఉన్నా..పవన్ ను  రాజకీయ నాయకుడిగా ఒప్పుకోలేకపోతున్నారు. జేపీ అయితే ఏకంగా పవన్ ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాడు అని డైరెక్ట్ గానే అన్నాడు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది. మరి భేటీ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? పవన్ తో కలిసి పని చేస్తారా..? లేదా..? అన్నది తెలియాలంటే భేటీ ముగిసే వరకూ ఆగాల్సిందే.