ఉండవల్లి, జేపీ భేటీ... చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం...

 

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణతో రాజకీయ వేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు భేటీ అయ్యారు. ఉండవల్లితో పాటు సీపీఐ కార్యదర్సి రామకృష్ణ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ ముగిసిన అనంతంరం..జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, నిజనిర్ధారణ కమిటీ విధివిధానాలపై చర్చించామని తెలిపారు. మన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, మేధావులు, అందరి ఆలోచనలు తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఏపీలో ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని చెప్పారు. నాలుగేళ్లయినా రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదని , దానికోసం తాము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా ఉండవల్లి నిన్న జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.