కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం?

 

టీడీపీని విభేదించాక పవన్ ఒంటరి పోరుకి సిద్ధమన్నారు.. కానీ పవన్, వైసీపీకి మద్దతని ఆరోపణలు వచ్చాయి.. అయితే ఈ ఆరోపణలను పవన్ కొట్టిపారేసే ప్రయత్నం చేసారు.. అలానే కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని, మూడునెలల్లో కార్యాచరణ రూపొందిస్తాం అని పవన్ ప్రకటించారు.. విచిత్రంగా పవన్ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. జనసేన, వైసీపీకి మద్దతిస్తే తాము ఆ పార్టీతో కొనసాగలేమని స్పష్టం చేసారు.. స్వయంగా పవన్, కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పినా, వాళ్ళకి నమ్మకం లేదా..

కమ్యూనిస్టులకు పవన్ మీద ఎందుకంత అనుమానం? అని చర్చలు మొదలయ్యాయి.. అయితే కమ్యూనిస్టుల అనుమానాలకు కూడా కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది.. కడప ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్న బంద్ కు పవన్ మద్దదైతే తెలిపారు కానీ, కేంద్రాన్ని నిలదీయట్లేదు, ఇదే కాదు ఏ విషయంలోనూ ఈ మధ్య పవన్ కేంద్రాన్ని విమర్శించట్లేదు.. అలానే ఎన్నికల విషయం వచ్చేసరికి పవన్ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాం అని చెప్తున్నాడు.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో పొత్తు గురించి పవన్ స్పష్టత ఇవ్వలేదు.. వీటి మూలంగా తమను వాడుకుని వదిలేస్తున్నారా అనే అనుమానాలు కమ్యూనిస్టులకు వస్తున్నాయట.