జానా ఆశలు ఆవిరి!

 

Jana Reddy in CM race,  telangana state, telangana bill, congress, 2014 elections, samaikyandhra

 

 

రాష్ట్ర రాజకీయాలలో జానారెడ్డికి మించిన అదృష్టవంతుడు మరొకడు లేదని ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు అనిపిస్తూ వుంటుంది. జానారెడ్డి గారు మాట్లాడుతూ వుంటే, ఆయన ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలాసేపు పడుతుంది. ఆయన మాట్లాడిన మాటలన్నిటిని ఒకచోట చేర్చి అతికించుకుంటే తప్ప ఆయన ఏం మాట్లాడారన్నది అర్థం కాదు.

 

జనాన్ని అంతగా గొప్పగా ‘ఇంప్రెస్’ చేయగల వక్త అయిన జానారెడ్డి రాజకీయాలలో ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. ఆయన్ని రాజకీయాలలో అదృష్టమే అందలం ఎక్కించిందని అనిపిస్తూ వుంటుంది. ఆ అదృష్టమే తనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తుందని ఆశించిన ఆయన నిరాశపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి కాకపోతే పోయె తెలంగాణకి అయినా ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడి విభజన ఉద్యమ మంటల్లో తనవంతు పెట్రోల్ పోశారు. కేంద్రానికి, కాంగ్రెస్ పార్టీకి తనవంతు అభూత కల్పనల నివేదికలు అందించి, రాష్ట్రం విడిపోవడానికి ఎంతో శ్రమించి రాచమార్గం వేశారు. అయితే తాను వేసిన రాచమార్గంలో ఎవరెవరో ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి పీఠం కోసం ముందుకు దూసుకువెళ్తూ వుండటం చూసి జానా బాధపడిపోతున్నారు.


ఇంతకాలం రాజకీయాల్లో ఆయన్ని అందలం ఎక్కించిన అదృష్టదేవత కీలక సమయంలో ముఖం చాటేసింది. తాజాగా రంగంలోకి వచ్చిన జైపాల్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎగరేసుకుపోయే అవకాశాలు బలంగా వుండటంతో జానా ఆశలు ఆవిరైపోయాయి. మొన్నటి వరకూ తెలంగాణ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నాయకులలో అగ్రస్థానంలో వున్న తాను ఇప్పుడు తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్న వారందరిలో ఒకడిగా, ఏమాత్రం ప్రాధాన్యం లేని స్థానానికి చేరుకోవడం ఆయనకు బాధను కలిగిస్తోంది. ఏదో ఆశించి ఏదో చేస్తే ఇప్పుడిలా అయ్యిందేమిటి భగవంతుడా అని ఆయన మథనపడుతున్నట్టు తెలుస్తోంది.