మారని పాక్... మళ్లీ కాల్పులు

 

పాకిస్థాన్ మళ్లీ రెచ్చిపోతుంది. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి విరమిస్తూ కాల్పులకు తెగబడుతోంది. తాజాగా  ఈ రోజు మ‌ధ్యాహ్నం పాక్ రేంజ‌ర్లు మ‌రోసారి రెచ్చిపోయారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో కాల్పుల‌కు తెగబడింది. ఈ కాల్పుల్లో ఓ జ‌వాను మృతి చెందగా... మరో పౌరుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పాకిస్థాన్ రేంజ‌ర్ల కాల్పుల‌ను భార‌త సైన్యం తిప్పికొడుతోంది. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.