హోరాహోరీ కాల్పులు... ఉగ్రవాదులు హతం...


భారత సరిహద్దు ప్రాంతంలో మరోసారి కాల్పులు చెలరేగాయి. జమ్మూ కాశ్మీర్ లో జనాన్లు, ఉగ్రవాదుల మధ్య హోరా హోరీ కాల్పులు జరిగాయి. వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్ లో బందిపోరా సెక్టార్ లోని సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బీఎస్ఎఫ్ జవాన్లు తనిఖీలు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా.. మరో ఉగ్రవాదిని పట్టుకున్నారు. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు.