జల్లికట్టు..తమిళనాడులో ఉద్రిక్తత...


ఒకపక్క సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటుంటే.. మరోపక్క తమిళనాడు ప్రాంతంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై నిషేదం విధించడమే దీనికి కారణం. దీంతో 'జల్లికట్టు' క్రీడకు అనుమ‌తి ఇవ్వాల‌ని త‌మిళులు ఆందోళ‌న చేపట్టారు. రాష్ట్రంలోని పలుచోట్ల జ‌ల్లిక‌ట్టు మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. పండుగ సందర్భంగా నిర్వహించే ఈ క్రీడ త‌మ‌ సంస్కృతికి నిదర్శనమని నినాదాలు చేశారు. మరోవైపు మధురై జిల్లాలోని అవనిపురం, పలెమేడు, అళంగనల్లూరు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో జ‌ల్లికట్టును నిర్వహించేందుకు ప్ర‌య‌త్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.