జగన్ కార్పోరేట్ వ్యూహం

 

 

jagan yanamala, tdp yanamala, jagan in jail, jagan assets case

 

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దివంగత నేత రాజశేఖరరెడ్డి హయంలో లబ్ది పొందిన కంపెనీలు సహకరిస్తున్నాయని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణ ఆరోపించారు. పార్టీలలో నేతల ఫిరాయింపులను కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు.

 

పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యూహ రచన చంచల్‌గూడ జైలు నుంచే జగన్ చేస్తుంటే, దానికి అవసరమైన డబ్బును వైయస్ వల్ల లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు సమకూర్చుతున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అవినీతి సొమ్ము పోతుందనే భయంతో వారు జగన్‌తో దోస్తీ చేస్తున్నారని యనమల మండిపడ్డారు.