జగన్ రాజధానిని దొనకొండకి మారుస్తారా ?

 

జగన్ రాజధానిని మారుస్తాడా? ఇప్పుడు ఇదే చర్చ ఏపీని పట్టి కుదిపేస్తోంది. ఇలా చర్చ జరగాడానికి ఒక కారణం జగన్ గద్దె నెక్కిన వెంటనే అమరావతి పనులను ఆపడమే కాక వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు - ఎమ్మెల్యేలు దోనకొండ మరియు చుట్టుపక్కల భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా ఈ అనుమానాలకు కారణమవుతోంది. జగన్ ప్రణాళికల ప్రకారమే వీరంతా కొంటున్నారనే చర్చ మొదలయ్యింది. 

నిజానికి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ విడిపోయినప్పడు ఏపీ రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ దోనకొండను ఏపీ రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. అయితే చంద్రబాబు ఈ ప్రభుత్వ భూములున్న ప్రాంతాన్ని కాకుండా అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అయితే అత్యదిక ప్రభుత్వ భూములు ఉన్న దోనకొండకి ఇండస్ట్రీయిల్ కారిడార్ పేరిట ఒక సెజ్ కి శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు. అయితే జగన్ మొండితనం, ఎన్నికల ముంగిట రాజధాని మార్పు విషయంలో అతడి వైఖరి సందేహాలకు తావిస్తున్నాయి. 

ఎన్నికల ముందుఓ జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు యోచన నిజంగానే జగన్‌కు ఉందేమో అన్న డౌట్లు వచ్చాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించి అక్కడ ఎంత అభివృద్ధి చేసినా భవిష్యత్తులో టీడీపీ దాని క్రెడిట్ పొందవచ్చు చేసుకోవచ్చు. 

తమ ప్రణాళికల్నే జగన్ అమలు చేశాడని చెప్పొచ్చు. కాబట్టి అమరావతిలో ముందు అనుకున్న స్థాయిలో అభివృద్ధి అయితే జరక్కపోవచ్చు. ఇప్పుడే కాక మరోవైపు 2014లో కూడా జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా దొనకొండలో భారీగా భూములు కొన్నట్లు సమాచారం. వాళ్ల కోసం జగన్ రాజధాని మార్చొచ్చన్న ప్రచారం కూడా ఉంది. కానీ రాజధాని మార్పు అంత సులువైన వ్యవహారమేమీ కాదు కాబట్టి అధికారికంగా ఇలాంటి మార్పేమీ చేయకుండా అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతిలో యాక్టివిటీ తగ్గించి రాయలసీమ, దొనకొండ ప్రాంతాలలో తమకు కావలసిన హైకోర్టు లాంటివి, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం.. క్రమంగా అమరావతి ప్రాధాన్యం తగ్గించడం లాంటివి జగన్ చేయొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది ఎంతవరకూ నిజం అవుతుందో ? తెలీదు కానీ చర్చ మాత్రం జరుగుతోంది.