జగన్ మమతానురాగం!

 

 

 

మొన్నీమధ్యనే జైల్లోంచి బయటకి వచ్చిన జగన్ ‘ముఖ్యమంత్రి కుర్చీ’ అనే తన కోర్కెను తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రత్యేక అనుమతులు తీసుకుని దేశమంతా తిరుగుతున్నాడు. మొన్నీమధ్యనే ఢిల్లీ వెళ్ళి జాతీయ నాయకుల మద్దతు సంపాదించుకోవాలని ప్రయత్నించిన జగన్‌కి అక్కడేమీ వర్కవుట్ కాలేదు. ఏదో సాధించాలని ఢిల్లీ యాత్ర చేసిన జగన్‌ని బీజేపీతో సహా అన్ని పార్టీల వరకూ ఖాళీ చేతులతో వెనక్కి పంపారు.

 

 

కు౦భకోణాల్లో ఇరుక్కుపోయిన వున్న జగన్‌తో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. జాతీయ పార్టీల దగ్గర పప్పులు ఉడకని జగన్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మీద కన్నేశాడు. మొదటగా కోల్‌కతా వెళ్ళిన జగన్ కోల్‌కతా కాళి మమతా బెనర్జీని కలిశాడు. మమతను అందరూ ‘దీదీ’ (అక్క) అంటారు. జగన్ కూడా సోనియాని ‘అమ్మా’ అని ఎంత ప్రేమగా పిలుస్తాడో మమతని ‘అక్కా’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఆమె మద్దతు పొందే ప్రయత్నం చేశాడు. ఆమె దగ్గర ఏ మమతానురాగాలు ఒలకబోశాడో గానీ, మమత జగన్ తమ్ముడికి బాగానే రెస్పెక్ట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.




అయితే 2014  ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యే రేసులో వున్న మమతా బెనర్జీ ఇప్పుడు అందర్నీ కలుపుకుపోయే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు జగన్‌తో భవిష్యత్తులో రాజకీయంగా ఏ అవసరం పడుతుందోనని ఆమె జగన్‌కి రెస్పెక్ట్ ఇచ్చి గంటలు గంటలు డిస్కషన్ చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చెల్లిని దూరం చేసుకున్న జగన్ ఇప్పుడు ఒక అక్కని సంపాదించుకున్నాడన్నమాట.  తాను జైల్లో వున్నప్పుడు పార్టీని నడిపించిన షర్మిల చెల్లమ్మకే జెల్ల కొట్టిన జగనన్న భవిష్యత్తులో మమత అక్కకి ఎన్కి జలక్కులు ఇస్తాడో వేచి చూడాలి. పాపం బెంగాలీ అక్కకి జగన్ మమతానురాగాల గురించి పూర్తిగా తెలుసో తెలియదో!