బిగ్ బ్రేకింగ్.. జగన్ ఆ ముఖ్య సలహాదారుని తప్పిస్తున్నారట!!

 

 

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాల మంది సలహాదారులను నియమించుకున్న విషయం తెలిసిందే. ఐతే అందులో కొంత మందిని ముఖ్య సలహాదారులుగా నియమించడం జరిగింది. ఇపుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం గత మూడు నెలలుగా ప్రభుత్వ కార్యకలాపాల్లో ముఖ్య భూమిక వహిస్తూ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఒక ముఖ్య సలహాదారుని తప్పిస్తున్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావటానికి ఆయనే కారణం అని జగన్ భావించినట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యాలయంలో పీపీఏల సమీక్ష పైన అక్కడి అధికారులు వివరణ కోరగా వారికి సరైన సమాధానం ఇవ్వటంలో ఆయన తడబడ్డారని అందుకే పీపీఏల  విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఐతే అయన ప్రాధాన్యత తగ్గకుండా మరో ముఖ్య పదవి కట్టబెట్టబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు విజిలెన్స్ కమిషనర్ గా పని చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ తాజాగా రాజీనామా చేయడం తో ఏర్పడిన ఖాళీని ఈ ముఖ్య సలహాదారుడితో భర్తీ చేయనున్నట్లు సమాచారం