భలే ప్లాన్ చేసిన జగన్...ముందు ఆ విషయం చూడండి సార్ !

 

బాద్యతలు చేపట్టిన నాటి నుండి సంచలనాలకు మారుపేరుగా మారుతున్న ఏపీ సీఎం వైస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో నేడు కలెక్టర్, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. ప్ర‌ధానంగా ఎటువంటి స‌మ‌స్య‌లు మీ దృష్టికి వ‌స్తున్నాయంటూ క‌లెక్ట‌ర్ల‌ను వీడియా కాన్ఫిరెన్స్ లో అడగగా  రైతు ఆత్మ‌హ‌త్యల ప్రస్తావన వచ్చింది. 

గత ప్రభుత్వ హాయంలో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కానీ 391 మందికి మాత్రమే పరిహారం  ఇచ్చారని తెలిసింది. దీంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు, వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. 2014–2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయని కానీ 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్టుగా దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. జిల్లాల్లో పరిశీలించి ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను జగన్ ఆదేశించారు. 

ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ఎక్కడైనా సరే రైతు కుటుంబాల్లో జరగ రానిది జరిగితే వెంటనే కలెక్టర్‌ స్పందించాలని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళాలని సూచించారు. చనిపోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతితో ఉండాలని, మానవత్వంతో మెలగాలని అన్నారు. మనిషే చనిపోయాడు మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని జగన్ స్పష్టం చేశారు. 

నిజానికి ఈ పధకాన్ని కూడా జగన్ ఎన్నికల హామీలలో ఒకటిగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందిస్తుందని జగన్ కీలక హామీ ఇచ్చారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్, రైతు సంక్షేమానికి దివంగత మహానేత వైఎస్ఆర్ ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు. 

రైతులకు ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతు ఎలా మరణించారని ఎవరూ అడగరని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడి దాకా బాగానే ఉంది జగన్ గతంలో చనిపోయిన రైతులకే కాక ఇప్పుడు చనిపోయినా ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్టే. నిజానికి చాలా చోట్లస్ విత్తనాల కొరతతో రైతులు బాధ పడుతుంటే దని గురించి పట్టించుకోకుండా ఈ ప్రకటన చేయడం అంటే ఈ ఆత్నహత్యలను మరగున పడేసే ప్రయత్నమే. 

చనిపోయిన రైతులకి పరిహారం ఇవ్వాలి కాదనం, అలాగే మరే రైతూ ఆత్మహత్య చేసుకోకుండా ఆపగలగాలి. ఇంగ్లిష్ లో ఒక సామెత ఉంటుంది Prevention is Better Than Cure అని. జగన్ కూడా అలాంటి నిర్ణయాలు ఏవయినా తీసుకుని ఉంటె బాగుండేది. అసలు రైతులు ఆఅత్మహత్యల జోలికి వెళ్ళకుండా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. అది ప్రభుత్వం అందించే అవకాశం ఉండదు కాబట్టి బీమా చేయించే అవకాశాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. 

అంతే కాక రైతుల నుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే కధ రైతుకు నిజమైన సాయం చేసినట్టు ! అలా కాక ఆయన చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇస్తామంటే ? రైతుకు ఏమని సందేశం ఇద్దామని ? ప్రభుత్వమో, అధికారులో వెళ్లి డబ్బు ఇస్తే కన్నవారి కడుపుకోత, ఆ పిల్లల ఆక్రందనలు తీరుస్తాయా ? రైతు మరణిస్తే ఇవ్వడం సబబే కానీ వారి జీవితానికి అండగా ఉండేలాగా మరేదైనా చేస్తే ఉపయోగం కదా. మరణించాక ఇచ్చే ఎక్స్ గ్రేషియా కన్నా బ్రతికున్నప్పుడు బ్రతుకు మీద భరోసా ఇస్తే ఆ రైతు కుటుంబం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. 

అదీ కాక నేటి సమాజంలో ముసల్లోలకి పెన్షన్ ఇవ్వడానికే లంచం అడుగుతున్నప్పుడు వీరికి డబ్బు మంజూరు చేసే అధికారులు ఈ ఏడు లక్షలలో ఏమీ తినరని మీరు గుండెల మీద చేయివేసుకుని చెప్పగలరా ? ఇంకా ఎన్ని రోజులు ఈ సానుభూతి రాజకీయాలు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ విత్తనాల ఆలస్యం వలన తొలకరి నాటికి కూడా అవి అందకపోతే ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి రాదని ! వారు ఏమైనా చేసుకుంటే అప్పుడు కూడా తెలుగుదేశం మీద నిందలు వేసి ఊరుకుంటారా ? రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అని ఒక ప్రభుత్వం తలచుకుంటే చేయలేనిది ఏముంది ? మీరు ఈ పరిహార ప్రకటనలు చేసేకంటే విత్తనాలు సంపాదించి పంచిపెట్టండి, రైతులకి ఎంతో మేలు చేసిన వారు అవుతారు.