జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించినట్టేనా..!

 

ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుందా? లేక వేరే ఏదైనా కొత్త రాజధాని తెరమీదకు వస్తుందా?.. ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తుంది.. దానికి కారణం జగన్.. ఆయన రాజధాని భూమిపూజకు రాలేదు.. అలానే పలు సందర్భాల్లో రాజధాని కోసం రైతులిచ్చిన భూమిని తిరిగిస్తానన్నారు.. దీంతో జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు భయపడ్డారు.. యువత కూడా రాష్ట్ర అభివృద్ధి ఐదేళ్లు వెనక్కెళ్తుందని ఆందోళన చెందారు.. 

అయితే ప్రస్తుతం జగన్ రాజధాని మీద తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది.. ఇప్పటికీ హైదరాబాద్ పార్టీ ఆఫీస్ నుండి ఏపీ రాజకీయాల చూసుకుంటున్న జగన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో విజయం సాధించాక అమరావతి వెళ్తానని.. అక్కడ కొత్త ఇల్లు, పార్టీ ఆఫీస్ నిర్మించుకుంటానని జగన్ చెప్పినట్టు తెలుస్తుంది.. దీనిబట్టి చూస్తే జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించినట్టే కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు.