జగన్ పై పీకే సీరియస్.... నా రిపోర్ట్ నేను ఇస్తున్నాను..

 

ఒకపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసుకుంటూ పోతుంటే.. మరోపక్క ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త పీకే మాత్రం సర్వేలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఎన్నో సర్వేలు చేసిన పీకే..తాజాగా చేసిన సర్వేలో జగన్ దిమ్మతిరిగే విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. రెండు విడతలుగా తన సర్వేను పూర్తి చేసిన పికె ఓ నివేదికను తయారుచేసి జగన్ కు అందచేశారట. ఆసర్వే ప్రకారం.. టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాలలో అక్కడ తమ పార్టీ నేతలకి డిపాజిట్లు కూడా వచ్చేలా లేవు అని పీకే రిపోర్ట్ లో తేల్చి చెప్పేశాడట. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్ళీ టిడిపి విజయకేతనం ఎగరేయడం ఖాయం అని..అలాగే , కృష్ణా , తూర్పు ,గుంటూరు, లలో టిడిపి హవా ఎప్పటిలానే కొనసాగుతుంది అని చెప్పాడట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాయలసీమలో కూడా ఈసారి జగన్ కు షాక్ తగిలే పరిస్థితులు ఉన్నాయట. ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల ప్రజలు కూడా టిడిపికే పట్టం కట్టేలా ఉన్నారని..దానికి కారణం చంద్రబాబు కరువు సీమలో నీటి ప్రాజెక్ట్ లు ఏర్పాటు చేసి నీటి కరువు లేకుండా చేయడమే అని చెప్పాడట.

 

ఇక ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ఈ సర్వే చూసిన జగన్ పీకే మీద మండిపడ్డాడట. దీనికి పీకే కూడా వెనక్కి తగ్గలేదట. పీకే కూడా.. సీరియస్ గా మాట్లాడట. నా రిపోర్ట్ నేను ఇస్తున్నాను ఇది పక్కా రిపోర్ట్ దీనిని బట్టి మీరు ఎలా చేస్తే బాగుంటుందో అలా చేద్దాం అని చెప్పడట. పీకే ఆన్సర్ కి షాకైన జగన్... ఆ తరువాత కూల్ అయ్యాడట. తమ కంచుకోట అయిన రాయలసీమలో కూడా జగన్ ఓట్లు రాకపోతే.. మిగిలిన ప్రాంతాల్లో పీకే చెప్పినట్టు డిపాజిట్లు రావడం కూడా కష్టమే. మరి చూద్దాం.. ఎన్నికల వరకూ సర్వేల్లో మార్పు ఏమైనా ఉంటుందో...?లేదో..?