అయ్యో జగన్... ఆఛాన్స్ కూడా పోయింది...

 


పాపం జగన్ కు ఉన్న ఒక్క ఆశ కూడా ఆవిరైపోయింది. ఇంతకీ ఆ ఆశ ఏంటనుకుంటున్నారా.. ఇంకేముంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కేసుల నుండి బయటపడదామన్న ఆశ. కానీ అది కూడా జరగదని అర్దమైపోయింది. జగన్ ఎప్పటినుండో బీజేపీతో పొత్తు కోసం ఆర్రులు చాస్తున్న సంగతి తెలిసిందే. ఏదో పైకి అదేం లేదు అని జగన్ అండ్ కో బ్యాచ్ కవరింగ్ ఇస్తున్నా... మోడీతో చేతులు కలపడానికి ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలేనే పలుమార్లు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాయబారం నడిపినట్టు..దీనిలో భాగంగానే ఆయన మోడీని కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇక మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ ఈ మధ్యకాలంలో ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకునే పనిలో పడ్డారు. బీజేపీ నేతలైతే కాస్త ఎక్కువగానే నోరు పారేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తమ పార్టీ లేకపోతే టీడీపీ లేదు అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్లు. మరి దీనికి టీడీపీ నేతలు ఊరుకుంటారా..? ఏదో మాతో పొత్తు ఉంది కాబట్టి మీకు ఆ నాలుగు సీట్లైనా వచ్చాయి అని వాళ్లు అంటున్నారు. వెరసి రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.

 

ఇక ఇదే అదనుగా భావించిన జగన్ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ ఏం తక్కువ తినలేదు... ఆ పార్టీ పెద్దలు కూడా వైసీపీ పార్టీతో ముందుకు పోవాలన్న ఆలోచన చేసినట్టు వార్తలు వచ్చాయి. అందుకే జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ మాట్లాడారు. ఆఖరికి ఏమైంది నంద్యాల ఎన్నికల్లో దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో.. మోడీగారికి బాగా అర్ధమైంది. అందుకే అప్పుడు కాస్త మారారు. ఇక గుజరాత్ ఎన్నికలు ఆయనలో పూర్తి మార్పు తీసుకొచ్చాయనుకోండి. అది ఎంతలా అంటే ఆయనే స్వయంగా చంద్రబాబుతో మాట్లాడతానని మన ఎంపీలకు చెప్పడమంత. రెండు రోజుల క్రితం టీడీపీ, బీజేపీ ఎంపీలు మోడీని కలిసిన నేపథ్యంలో... ఏపీకి తాను అండగా ఉంటానని.. ఈ విషయం నేను చంద్రబాబుతో మాట్లాడతానని మోడీ చెప్పారట. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు ముందు ఎంపీలు షాకైనా... ఆతరువాత గుజరాత్ ఎన్నికల తరువాత.. మోడీ, షా కి చంద్రబాబు ప్రాధాన్యత ఏమిటో తెలిసొచ్చిందని అనుకున్నారట. అంతేకాదు ఎంపీలు కలిసిన రెండో రోజే.. ఈ నెల 12 న చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇస్తున్నట్టు పీఎంఓ నుంచి బాబుకి పిలుపు వచ్చింది. దీంతో జగన్ బ్యాచ్ కు షాక్ తగిలింది. ఏదోలా పొత్తు పెట్టుకొని... తనపై ఉన్నకేసుల నుండి బయటపడొచ్చు కదా అని ఆశలు పెట్టుకున్న జగన్ కు మోడీ షాకిచ్చారు. జగన్ కు నిరాశే మిగిలింది.