పిచ్చి జనాలు.. నన్ను కూడా వదిలిపెడతారు..!

 

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1.7 లక్షల కోట్ల భారీ స్కాం. దేశంలోనే అతిపెద్ద స్కాంగా సంచలనం సృష్టించిన 2జీస్కాం. ఒక్కముక్కలో ఎవరూ దోషులు కారని పటియాలా కోర్టు తేల్చిచెప్పింది. అది కూడా చాలా సింపుల్ రీజన్. సాక్ష్యాదారాలు లేవని. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసలు ఈ స్కాంను బయటపట్టారు. ఇక కాగ్  1.7 లక్షల కోట్ల భారీ స్కాం జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది. ఆ తరువాత రంగంలోకి దిగిన సీబీఐ, ఈడీ ఈకేసులో అప్పడు టెలికాం శాఖ మంత్రిగా వ్యవహరించిన ఎ.రాజా... కనిమొళితోపాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేసింది. 2011 నుండి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. ఈరోజు తుది తీర్పు వచ్చింది. ఇక ఇంత పెద్ద స్కాంలో ఇంత ఈజీగా తీర్పు వచ్చినందుకు కొంతమంది హ్యాపీగా ఉన్న... చాలామంది మాత్రం షాక్ లోనే ఉన్నారు. ఇంత పెద్ద కోట్ల స్కాంలో కేవలం ఆధారాలు లేవని చెప్పి తీర్పునిస్తారా అని అయోమయంలో పడ్డారు అందరూ. ఇది సీబీఐ చేతకాని తనమా లేక.. ప్రభుత్వానిదా..?

 

ఈ లెక్కన చూస్తే ప్రభుత్వలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని కోట్ల స్కాంలనైనా.. ఎన్ని కోట్లు తిన్న అవినీతి పరులనైనా ఈజీగా వదిలిపెట్టేస్తుందేమో అని సామాన్యులకు వస్తున్న డౌట్. ఎవరూ దోషులు కానప్పుడు, ఎవరూ స్కాం చేయ్యినప్పుడు,  1.7 లక్షల కోట్ల భారీ స్కాం జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది.. కాగ్ 2012 ఫిబ్రవరిలో అపెక్స్ కోర్ట్, 122 టెలికాం లైసెన్స్ లు ఎందుకు రద్దు చేసింది ? 9 కంపెనీలకు అలాట్ చేసిన స్పెక్ట్రమ్ లు ఎందుకు రద్దు చేసింది ? చూస్తుంటే ఈ స్కాంలో జరిగినట్టే మిగిలిన కుంభకోణాల్లో కూడా అలానే జరుగుతుందేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. బొగ్గు కుంబకోణం, కామన్ వెల్త్ స్కాం, గాలి జనార్ధన రెడ్డి స్కాం, జగన్ దోపిడీ, ఇవి కూడా జరగలేదు అని చెప్తారామో? ఏముంది ఇన్ని లక్షల కోట్ల స్కాంలోనే సాక్ష్యాలు లేవని చెప్పినట్టు.. ఈకేసుల్లో కూడా సాక్ష్యాలు లేవని చెప్పినా ఆశ్యర్యపోనక్కర్లేదు. అలా తయారయ్యాయి.

 

ఇక లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు ఈ తీర్పు చాలా సంతోషకరంగా ఉండొచ్చేమో. తాను కూడా సింపుల్ గా బయటకు రావచ్చన్న ధీమాతో ఉండొచ్చు. ఎలాగూ ప్రస్తుతం బీజేపీ-టీడీపీకి సరిగ్గా పడటంలేదు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూస్తే.. బీజేపీతో టీడీపీ పొత్తు డౌటే. ఒక పక్క చంద్రబాబు సైలెంట్ గా ఉన్నా...బీజేపీ నేతలు కష్టంగా గెలిచి కూడా ఎగిరిపడుతున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదరకపోతే.. బీజేపీ, వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీతో పొత్తుకోసం జగన్ కూడా ఆరాటపడుతున్నాడు. ఒకవేళ అదే జరిగితే.. జగన్ పై ఉన్న లక్షకోట్ల అవినీతి కేసుపై కూడా సింపుల్ గా తీర్పు వచ్చేస్తుంది. ఏముంది సాక్ష్యాలు సరిగా లేవన్న రీజన్ చూపిస్తారు.

 

చెప్పేవాడికి.. వినేవాడు లోకువ అని ఊరకనే అనలేదు. కేంద్రప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చెబితే ప్రజలు అలా చూస్తూ..వింటూ పోతున్నారు కాబట్టే..ప్రజలంటే ఇంత లోకువైపోయింది. ఇక ఈ తీర్పులు చూసి మళ్ళీ హై కోర్టులు అని, సుప్రీమ్ కోర్టులు అని తిరిగే సరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. అప్పుడెప్పుడో జయలలితపై అక్రమాస్తుల కేసు పెట్టారు. ఆ తీర్పు వచ్చే సమయానికి ఆమె లేకుండానే పోయారు. అలానే.. 2జీస్కాంలో తీర్పు కోసం హైకోర్టు.. సుప్రీంకోర్టు అంటూ తిరిగే సరికి ఇప్పుడు 4జీ లో ఉన్నా.. ఇంకొన్ని రోజుల్లో 5జీ రాబోతుంది.. ఈ కేసు తేలే సరికి, 10జి యుగంలో ఉంటావేమో. పాపం న్యాయం కోసం ఎదురుచూసే పిచ్చి జనాలు ఎవరిని నిందించాలి ? రాజకీయ నాయకులనా ? సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలనా ? కోర్ట్ లనా ?