ఏ పాదయాత్రలో ఇన్ని బ్రేకులు ఉండవేమో..?

 

 

మా జగనన్న మగాడు.. ఎన్ని వేల కిలోమీటర్లు అయినా ఇట్టే నడిచేస్తాడు... చంద్రబాబు ముసలాడు.. ఇంకేం చేస్తాడు.. ఇవి వైసీపీ నేతలు కోసిన కోతలు. అబ్బో ఒకటా రెండా తమ నేత గురించి ఓ రేంజ్లో పొగిడారు. కట్ చేస్తే పాదయాత్ర రెండో రోజే నడుముకి బెల్ట్. జగన్ బాబుగారికి నడుం పట్టేసిందట అప్పుడే. పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్యారడైజ్ ఎఫెక్ట్.. రెండో రోజు నడుముకు బెల్ట్.. ఇప్పుడు కాళ్లు నొప్పులు.. ఇలా అయితే పాదయాత్ర జరిగినట్టే. పాదయాత్ర మొదలుపెట్టిన నాలుగు రోజులకే ఇలా ఉంటే.. ముందుంది కదా అసలు సినిమా. అప్పుడే కాళ్లు నొప్పులు అంటే ఎలా. అసలు ఈ నాలుగు రోజుల్లో జగన్ నడిచింది.. మహా అయితే 30-40 కిలోమీటర్లు. అది కూడా కంటిన్యూస్ గా కాదు.. మధ్య మధ్యలో జనాలతో ముచ్చటిస్తారు.. కార్యకర్తలతో మాట్లాడతారు.. లంచ్ బ్రేక్... కాసేపు రెస్ట్ బ్రేక్.. ఇన్ని బ్రేకులు తీసుకుంటారు. ఇక చీకటి పడకముందే ప్యాకప్. మరి ఈ మాత్రానికే కాళ్లనొప్పులని బిల్డప్ ఎందుకు. కాస్త కాళ్లునొప్పులు పుట్టగానే యాత్రకు బ్రేక్ ఇచ్చి డాక్టర్లతో చెక్ చేయించుకుంటున్నారు.

 

మళ్లీ జగన్ కు ఓ బంపరాఖర్ కూడా ఉంది. ప్రతి శుక్రవారం రెస్ట్ డే. అదేనండీ.. కోర్టుకు హాజరవ్వాలి కదా. కోర్టు పేరుతో గురువారం మధ్యాహ్నం నుండే జంప్ అవ్వడానికి ట్రై చేస్తారు. శుక్రవారం కోర్టు హాజరై ఆ తరువాత రెస్టే. ఇన్ని రెస్ట్ లు తీసుకుంటూ కూడా మళ్లీ ఆ నొప్పులు.. ఈ నొప్పులు అని గోల. మళ్లీ వీళ్లకి చంద్రబాబుతో పోలిక. రోజురోజుకు చంద్రబాబు వయసు తగ్గుతుంది కానీ పెరగడం లేదు. ఇప్పటికీ కుర్రాడిలా పరుగులు పెడుతున్నారు. పెట్టిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో కాళ్లు బొబ్బలెక్కినా ఆపలేదు. డాక్టర్లు ఆగమన్నా కుదరదన్నారు. అలాంటి చంద్రబాబుతో పోలిక ఎందుకట. ఇంకా వేల కిలోమీటర్లు ముందున్నాయి. నాలుగు రోజులకు ఇంకా 50 కిలో మీటర్లు కూడా నడవలేదు. అందులో ప్రతి శుక్రవారం బ్రేక్. పాదయాత్ర మొత్తం మీద 3వేల కిలో మీటర్లకు శుక్రవారం పేరుతో బ్రేకులు.. మధ్య మధ్యలో రెస్ట్ బ్రేకులు ఇలా సీరియల్లో బ్రేకుల్లా.. బ్రేకులు ఎక్కువ సీరియల్ తక్కువగా పాదయాత్ర చేస్తే ఎప్పుడు ముగుస్తుందో.. ఏమో..?