ఏబీఎన్, ఆంధ్రజ్యోతి.. మీరు రావడం కరెక్ట్ కాదు..


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రకాశం జిల్లా సంతరావూరులో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అందరిలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థల ప్రతినిధులు కూడా వెళ్లారు. ఇక మీడియా సమావేశానికి వచ్చిన జగన్ అక్కడ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే.. ఆంధ్రజ్యోతి నుంచి ప్రసాద్, ఏబీఎన్ చానల్ నుంచి సురేష్ ఈ సమావేశానికి వచ్చారు. ఇక వారిని అన్నా అని సంబోధించిన జగన్... తన మీడియా సమావేశాలకు రారాదని ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు ఎప్పుడో చెప్పాను.. కానీ మీ ఇద్దరూ రావడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ, లెట్స్ గో దిస్ మూమెంట్.. నెక్ట్స్ టైమ్... మనం వద్దని చెప్పినప్పుడు... ఆ పేపర్ ను, ఆ టీవీని పబ్లిక్ గా కోర్టులో కేసు వేశాం. మీరు రాసిన రాతలు, సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా, ఇన్టెన్షనల్ గా... కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ ను, ఏబీఎన్ అనే చానల్ ను వైఎస్ఆర్ సీపీ బాయ్ కాట్ చేసింది. రావద్దని వారి పేపర్ లో రాసే రాతలు, టీవీలో చూపే వార్తలను నమ్మవద్దని ఎన్నోసార్లు చెప్పాను. మీరు వచ్చారు కాబట్టి కేక్ తిని పొండి" అని అన్నారు.