చంటిపిల్లాడికి జగన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..?


"ప్రజా సంకల్పం" పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో ఆయన ప్రజలని పలకరిస్తూ.. వారితో మాట్లాడుతూ వెళుతుంటారు. అయితే ఈ పాదయాత్రలో భాగంగా జగన్ కు ఓ బంపరాఫర్ వచ్చింది. అదేంటంటే... ఓ చిన్న పిల్లాడికి పేరు పెట్టే ఆఫర్. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్‌ దంపతులు తమ ఏడాది చంటి పిల్లాడిని తీసుకొని జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరగా, జగన్ నాన్న పేరు పెడదామని అన్నాడు. అనుకున్నదే తడవు.. ఆ చిన్నారికి రాజశేఖర్‌ అని జగన్‌ నామకరణం చేశారు. దీంతో ఆ దంపతులు, కుటుంబ సభ్యులు సంబరపడిపోయారు. మొత్తానికి జగన్ పాదయాత్రలో ఇంకా ఏమేం చేయాల్సి వస్తుందో..