జగన్ పై మరో కేసు నమోదు...

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో భాగంగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్న జగన్ పై ఇప్పుడు  పులివెందుల పోలీస్టేషన్ లో కేసు నమోదుఅయింది. దీనికి కారణం ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడమే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని.. లేకపోతే తాము అసెంబ్లీ సమావేశాలకు రామని చెప్పారు. దీంతో పులివెందుల టీడీపీ నాయకులు..  ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఉల్లంఘించినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని...  ఎమ్మెల్యేగా జగన్ ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రజలు తమ కోసం ఎమ్మెల్యేలకు ఓటేసి చట్ట సభలకు పంపితే వారు ఇందుకు విరుద్దంగా వ్యవహరించడాన్ని టీడీపీ నేతలు తప్పు పట్టారు. అందుకే జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.