జగన్ హామీ... అవ్వ షాక్...

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా జగన్ ఓ అవ్వకు హామీ ఇచ్చాడట. అది విన్న అవ్వ షాక్ గురవ్వడమే కాకుండా.. అక్కడున్న ప్రజలు కూడా షాకయ్యారట. మరి అంతలా ఆ అవ్వ, అక్కడ ఉన్న జనం షాక్ అయ్యేంత హామీ జగన్ ఏమిచ్చాడబ్బా అనుకుంటున్నారా..? అదేంటంటే.. పాదయాత్రలో భాగంగా.. ఓ వృద్ధురాలు తనకు ఎవరూ లేరని, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నానని, తనను ఆదుకోవాలని జగన్‌ను కోరిందట. అందుకు జగన్... రాష్ట్రంలో ఎవరూ లేని అనాథలు, వృద్ధులు స్వచ్ఛందంగా ఎక్కడైనా ఉండాలనుకునే వారిని తాను అధికారంలోకి వస్తే ఆదుకుంటానని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మండల కేంద్రంలో వృద్ధాశ్రమాలు కట్టిస్తానని హామీ ఇచ్చాడట. అందులో వైద్యులు, నర్సులు కూడా ఉండేలా చూస్తానని చెప్పుకొచ్చాడట. అయితే ఇందుకోసం ఏడాది ఓపిక పట్టాలని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కట్టడానికి మరో ఏడాదిన్నర సమయం కావాలని, ఆ తర్వాత సెటిల్ చేస్తానని చెప్పడంతో అవ్వ షాక్‌కు గురైంది. ఆమెతో పాటు అక్కడున్న జనం కూడా జగన్ చెప్పిన సమాధానానికి షాకవ్వగా... కొంతమంది అప్పటి వరకూ ఆమె బతికి ఉంటుందా? అని సెటైర్లు కూడా వేసుకున్నారట. మరి ఇప్పుడు సాయం అడిగితే ఓ రెండేళ్ల తరువాత సాయం చేస్తాననడం జగన్ అమాయకత్వం అనుకోవాలా..? లేక.. ఇంకేదైనా అనుకోవాలో..? ఆ మాత్రం సాయం చేయనప్పుడు పాదయాత్రలు ఎందుకట....