జగన్ కు వకాల్తా పుచ్చుకున్న బీజేపీ....


 

వైసీపీ పార్టీ పరిస్థితి ఏపీలో ఏంటో అందరికీ తెలిసిందే. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ తీరు నచ్చక పార్టీ నుండి కీలక నేతల సైతం జంప్ అవ్వడం ఇవన్నీ పార్టీ స్థాయిని ఎప్పుడో పడేశాయి. ఇక జగన్ పాదయాత్ర గురించి తమ ఛానెల్ కు తప్ప మరో ఛానెల్ కు గుర్తుండదు. అలాంటిది జగన్ గురించి జాతీయా మీడియాలో రావడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి కారణం.. బీజేపీతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఎలాంటి సంబంధం లేకపోయినా... బీజేపీ మౌత్ పీస్ గా పేరున్న రిపబ్లిక్ టీవి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. అప్పుడే బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకుంటాయేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే చెబుతూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పకనే చెబుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటిది... దాని గురించి వార్తలు రాయడం మానేసి.. సమయం సందర్బం లేకుండా... జగన్ కు వకాల్తా పుచ్చుకొని కొన్నిజాతీయ మీడియా సంస్థలు జగన్ గెలుస్తాడు అని వార్తలు రాయడం పిచ్చికి పరాకాష్ట అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...వైకాపా అధికారంలోకి రాకపోయినా...టిడిపి దగ్గరకు చేరుతుందని...టైమ్స్‌ఆఫ్‌ఇండియా కథనంలో పేర్కొంది. టిడిపికి...వైకాపాకు కేవలం రెండుశాతం మాత్రమే ఓట్లు తేడా ఉందని..రాబోయే రోజుల్లో లోటును అధిగమించి..అధికారం వైపు వైకాపా దూసుకుపోతుందని..'జగన్‌' చేస్తోన్న పాదయాత్ర, రాష్ట్రానికి ప్రత్యేకహోదా..వంటి అంశాలు..ప్రజల్లోకి బాగా వెళ్లాయని...దీంతో...'జగన్‌' గెలుస్తారని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ రకంగా బీజేపీ-వైసీపీ పొత్తు ఖాయమని తెలుస్తుంది. లేకపోతే.. ఇక్కడ తెలుగు రాష్ట్రాలే పట్టించుకోవడం లేదుకానీ.. దేశంలో వార్తలు ఏం లేనట్టు జాతీయ మీడియా జగన్ కు గురించి ఇలాంటి రాతలు రాయడం నిజంగా నవ్వుకోవాల్సిన విషయం. బీజేపీ హ్యాండ్ లేకపోతే ఇలాంటి వార్తలు రావడం.. అందులో జాతీయ మీడియా సంస్థల్లో రావడం అంటే కష్టం. మరి ఇప్పటికే 'బిజెపి'తో 'జగన్‌' కుమ్మక్కయ్యారని ప్రజలు భావిస్తున్నారు.. ఈ వార్తలు చూసి వైసీపీ-బీజేపీ పొత్తు పై క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీతో వైసీపీ కలిస్తే ఏముంటుంది.. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్న సామెత లాగ ఉంటుంది..