స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్.!!

 

తమ ప్రతిభతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకోవాల్సిన ఆర్టిస్టులు.. పెడదారి పడుతున్నారు.. చివరికి అరెస్ట్ అయ్యి తమ పేరు పోగొట్టుకుంటున్నారు.. డ్రగ్స్ కేసు, అమెరికాలో సెక్స్ రాకెట్ ఇవి మరువకముందే టాలీవుడ్ మీద మరో మరక పడింది.. స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ అయ్యాడు.

 

 

జబర్డస్త్ లో లేడీ గెటప్స్ తో పేరు తెచ్చుకున్న హరి, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు.. హరి పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.. హరి స్మగ్లింగ్ తో కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు తెలుస్తోంది.. అలానే తను స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో షకలక శంకర్ హీరోగా నటించిన 'శంభో శంకర' సినిమాకి ఫైనాన్స్ కూడా చేసినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం హరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నారు.