14 మంది సభ్యులతోనే కష్టమైతే.. 29 మందితో ఇక చుక్కలే: ఐవైఆర్

 

 

జగన్ ప్రభుత్వం 29 మంది సభ్యులతో కూడిన టీటీడీ కొత్త జంబో పాలక మండలిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఎపి మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు సెటైర్లు వేశారు. తాను టీటీడీ ఇవోగా ఉన్నపుడు 14 మంది సభ్యుల బోర్డుతోనే పెద్ద సమస్యగా ఉండేదని ఐతే ఇపుడు ఏకంగా 29 మంది సభ్యుల బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల అయన అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదని విమర్శించారు. రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోనైనా దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి వస్తేనే ముక్తి ఉంటుందన్నారు. టీటీడీ వ్యవస్థలో నిర్ణయాలు ఈఓ, చైర్మన్, ముఖ్యమంత్రి మధ్య నడుస్తాయని, బోర్డు సభ్యులు మాత్రం కేవలం దర్శనాలకు మాత్రమే పరిమితమని అయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. 29 సభ్యుల బోర్డును మేనేజ్ చేయటం లో ఈవో పడే బాధ వర్ణనాతీతం అని అయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.