ఐటి ఎగుమతులలో తెలంగాణ లక్షా తొమ్మిది వేల కోట్లకి చేరుకుంది: కె.టి.ఆర్

 

అసెంబ్లీలో వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.ఆర్ మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడు నవంబరులో నాలుగు నగరాల నుంచి ఐటిఐఆర్ మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించిందని తెలిపారు. బెంగుళూరు, హైదరాబాద్, హుబ్లీ, వైజాగ్ ఈ నాలుగు నగరాలు కేంద్ర ప్రభుత్వానికి మాకు ఐటిఐఆర్ ను మంజూరు చేయండి అని అప్లై చేసుకున్నాయన్నారు. చివరగా కేంద్ర ప్రభుత్వం ఐటిఐఆర్ ను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు మంజూరు చేశారన్నారు.

నవంబర్ తర్వాత చెన్నై, భువనేశ్వర్ కు సూత్రప్రాయమైన అనుమతులు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పారిశ్రామిక కారిడార్ లను డెవలప్ చేయాలని లేదా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఆయా ఏరియాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాలని కొన్ని ప్రొజెక్షన్ తయారు చేసిందనీ, అటువంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత ఇస్తాం, మీరు స్థానికంగా కొంత చేసుకోండి అని ఒక ప్రొజెక్షన్ తయారు చేసి ఇవ్వచ్చు అంతే తప్ప ఒక్క రూపాయి కూడా యుపిఎ ప్రభుత్వం దిగిపోయే వరకు ఐటీఐఆర్ కు ఇవ్వలేదన్నారు.

బట్టి గారు చెప్పారు ఇరవై సంవత్సరాల కాలంలో హైదరాబాద్ ఐటీ ఎగుమతులు రెండు లక్షల కోట్లు చేరుకుంటాయని, కేవలం అయిదు సంవత్సరాల కాలంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లక్షా తొమ్మిది వేల కోట్లకి చేరుకున్నాయ్, కాబట్టి ఐటి ఎగుమతులపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.