రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడో అయిపోయిందా..!!

 

రాహుల్ గాంధీని ప్రధాని ఎప్పుడు అవుతారు? అని అడిగేవాళ్లకంటే.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అడిగేవాళ్ళే ఎక్కువ.. మరి దేశంలోని రాజకీయ నాయకుల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆయన.. ఆ మాత్రం అడగరా ఏంటి?.. ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.. ఈ పర్యటనలో భాగంగా మీడియా ఎడిటర్లతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో రాహుల్ పెళ్లిపై కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తన పెళ్లి కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో జరిగిపోయిందని రాహుల్ చమత్కరించారు.. రాహుల్ చమత్కారం చూస్తుంటే అసలు పెళ్లి చేసుకొనే ఆలోచన లేనట్టుందిగా అంటూ చర్చలు మొదలయ్యాయి.