ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీ కొంప ముంచిన NRI ముఠా

 

దూరపు కొండలు నునుపు అన్నట్టుగా.. కొందరు ఎన్నారైల మాయలో పడి, వారినేదో గొప్పవారిలా ఊహించుకొని చంద్రబాబు దెబ్బతిన్నారా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నారైలు ఇక్కడ నుంచి విదేశాలకు బ్రతుకుదెరువు కోసం వెళ్లిన వారు మాత్రమే. కానీ బాబు, లోకేష్ లు మాత్రం.. కొందరు ఎన్నారైలను ఆకాశం నుంచి దిగొచ్చిన వారిలా చూస్తూ.. వారి భజనకి, వారి మాయమాటలకు పడిపోయి.. తానా అంటే తందానా అన్నారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు.

ఎన్నారైలు నాలుగు డాలర్లు వెనకేసుకునే సరికి.. వారికి టికెట్, వీరికి పదవి అంటూ బాబు, లోకేష్ ల వద్ద పైరవీలు చేసారు. దీంతో నిజమైన కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడిన సరైన గుర్తింపు లేక చిన్నగా పార్టీకి దూరమవుతూ వచ్చారు.

దీనికి తోడు వేమూరి రవి వంటి వారు APNRT పేరుతో చేసిన హడావుడి అంతాఇంతా కాదు. అదేదో ప్రభుత్వ సంస్థనో, పార్టీ అనుబంధ సంస్థనో అన్నట్లు చేసారు. అంతేనా ఎన్నారైలు తిరుమల వస్తే వారికి ప్రత్యేక దర్శనం టికెట్లు అంట. వారేమన్నా దైవాంశ సంభూతులా? లేక మంత్రులు, ప్రధాన మంత్రులా?. ఇలా వారిని నెత్తికి ఎక్కించుకొని బాబు తీవ్ర విమర్శలు పాలయ్యారు.

బాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎన్నారైలు.. టీడీపీ తమ కులానికి చెందిన పార్టీ అన్నట్టుగా అత్యుత్సాహం చూపడం కూడా పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసింది. టీడీపీ మొదటినుంచి అండగా ఉన్న అనేక కులాలను దూరం చేసింది. ఈ ఎన్నారై ముఠా ఇంకా చాలా కార్యాలు వెలగబెట్టింది. అవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.