బీజేపీలోకి జార్ఖండ్ డైనమైట్..! ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు

 

టీమిండియా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ... క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. సౌతాఫ్రికా టూర్‌కి ధోనీని ఎంపిక చేయకపోవడంతో... ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్‌బై చెప్పాలని ధోనీ డిసైడయ్యాడని, త్వరలో ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ... పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ధోనీ ...బీజేపీలో చేరబోతున్నారని అంటున్నారు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు‌ అతిత్వరలో ఎన్నికలు జరగనుండటంతో... అసెంబ్లీ బరిలో ధోనీ దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమధ్య ఎక్కువగా జాతీయవాదం వినిపించడంతోపాటు ఇటీవల 2నెలలపాటు ఆర్మీలో పనిచేశారని అంటున్నారు.

ఇక, టీమిండియా క్రికెటర్ గా, కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ... పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపాడు. అంతేకాదు భారత్ కు వన్డే, టీ20 వరల్డ్, ఆసియా కప్ లను అందించి సంచలనం సృష్టంచాడు. కెప్టెన్ గా ఎన్నో సంచలన విజయాలను సాధించడమే కాకుండా, గ్రేట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 90కి పైగా టెస్టు మ్యాచులాడి సుమారు 5వేల పరుగులు చేసిన ధోనీ... 340కి పైగా వన్డేల్లో 10వేల 500 రన్స్ చేశాడు. వన్డేల్లో 10వేల పరుగులు చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ధోనీ ఒకడు. ఇలా ఎన్నో రికార్డులు ధోనీ ఖాతాలో ఉన్నాయి.

అయితే, తన రిటైర్మెంట్ పై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నా, ధోనీ స్పందించకపోవడంతో నిజమేనని అంతా భావించారు. అయితే, ధోనీ అర్ధాంగి సాక్షి ఆ సందిగ్దతకు సింగిల్ లైన్ తో తెరిదించింది. డైరెక్టుగా ఖండించకపోయినా, మరి వీటినే వదంతులు అంటారు అంటూ ట్వీట్ చేసి, రిటైర్మెంట్ వార్తలకు తెరదించారు. సాక్షి చేసిన ఆ ట్వీట్ కు క్షణాల్లోనే వేలకొలది లైకులు, రీట్వీట్లు  వచ్చాయి. మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. తమకు సమాచారం లేదంటూ తెలివిగా రియాక్టయ్యింది. మరి ధోనీ నిజంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలికల్ ఎంట్రీ ఇస్తారో లేదో..!