వైఎస్ యాత్ర కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా?

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ల ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే మహానటి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. మరో రెండు బయోపిక్ లు కూడా త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.. వాటిళ్లో ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ కాగా, మరొకటి వైఎస్ఆర్ బయోపిక్.. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నాడు.. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.. ఇక వైఎస్ఆర్ బయోపిక్, యాత్ర పేరుతో ఆనందోబ్రహ్మ ఫేమ్ 'మహి వి రాఘవ' దర్శకత్వంలో తెరకెక్కుతుంది.. వైఎస్ జయంతి సందర్బంగా తాజాగా యాత్ర టీజర్ విడులైంది.. టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.. అయితే ఇప్పుడు యాత్ర సినిమా గురించి ఒక ఆసక్తికమైన చర్చ జరుగుతుంది.. అదే వైఎస్ 'యాత్ర' వైసీపీకి మేలు చేస్తుందా? లేక కాంగ్రెస్ కు మేలు చేస్తుందా?.

యాత్ర సినిమా 'వైఎస్ పాదయాత్ర చేసి ప్రజల్లోకి ఎలా వెళ్లారు? సీఎం ఎలా అయ్యారు' అనే పాయింట్ మీద తీస్తున్నట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యాత్ర సినిమా విడుదలైతే, జగన్ కూడా తన తండ్రి లాగే కష్టపడుతున్నాడనే భావన ప్రజలకి వెళ్లి, వచ్చే ఎన్నికల్లో జగన్ కి బోలెడంత ప్లస్ అవుతుందనేది వైసీపీ నేతల భావన అని తెలుస్తోంది.. అయితే ఇప్పుడు తాజాగా ఒక కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో వైఎస్ పేరొకటి.. వైఎస్ కాంగ్రెస్ లో ఉండి, కాంగ్రెస్ కోసం పాదయాత్ర చేసారు.. తరువాత సీఎం పదవిని చేపట్టారు.. చివరి శ్వాస కూడా కాంగ్రెస్ లోనే వదిలారు.. అలాంటి వ్యక్తి బయోపిక్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రస్తావన వస్తుంది.. అదే జరిగితే జగన్ కి కాదు కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందనే మాట వినిపిస్తుంది..

ఏపీలో ఒకప్పుడు మెజారిటీ మైనార్టీలు, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు.. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కాంగ్రెస్ ని వీడి వైసీపీ లో చేరారు.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. వైసీపీ బీజేపీ తో దోస్తీ దిశగా అడుగులు వేస్తోంది.. మరోవైపు కాంగ్రెస్ ఏపీలో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టింది.. దీంతో కొందరు తిరిగి కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. ఇదే సమయంలో యాత్ర సినిమా వస్తే.. వైఎస్, కాంగ్రెస్ వ్యక్తి అనే విషయం జనాల్లోకి వెళ్లి కాంగ్రెస్ కి మేలు జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది.. చూద్దాం మరి ఏపీలో బలపడాలని చూస్తున్న కాంగ్రెస్ కి యాత్ర బలం అవుతుందో? లేదో?.