వివాదాస్పద ఏపీ ప్రాజెక్ట్.. పీకే సొంత టీమ్ గురువుకే పంగనామం పెట్టిందా..!

గత సంవత్సరం ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ఐతే ఈ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ విశేష కృషి ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ తాను గెలిచిన తర్వాత ఆ టీమ్ తో జరిగిన మీటింగ్ లో స్వయంగా జగన్ కూడా వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. ఐతే ఈ గెలుపు తర్వాత సీఎం జగన్ పీకే టీమ్ కు ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్, ప్రభుత్వ పథకాల ప్రచారం తో పాటు వివిధ కార్యక్రమాల పై వర్క్ చేయాలనీ కోరినట్లు తెలుస్తోంది. దీని పై స్టడీ చేసిన పీకే ఈ ప్రాజెక్ట్ కోసం కొంత భారీ మొత్తాన్ని కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ప్రాజెక్ట్ ను సీఎం కొద్దీ రోజులు పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ లోగా పీకే టీమ్ లోని కొంత మంది మెంబర్స్ వేరే ప్రాజెక్టుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా కొంతమంది మాత్రం ఇదే ప్రాజెక్ట్ తమకు అప్పగిస్తే పీకే కోట్ చేసిన మొత్తం లో సగానికే చేస్తామని ప్రపోజ్ చేశారట. ఐతే ఈవిషయాన్ని సీఎం పీకే కు తెలియ చేయగా మొదట షాక్ తిన్నా తరువాత మీ ఇష్టం అని ఉరుకున్నారట. దీంతో ప్రభుత్వం వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం ను ఆ టీమ్ కు అప్పగించారట. 

ఐతే కొద్దీ రోజుల నుండి వలంటీర్ల వ్యవస్థ తో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పీకే టీమ్ చేతిలో పెడుతున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే తాజాగా ఈ వార్తల పై స్పందించిన ప్రశాంత్ కిషోర్ తాము కానీ తమ టీమ్ కానీ ఏపీలో ఎటువంటి ప్రాజెక్ట్ లు చేయడం లేదని ట్వీట్ చేసారు ఇంతకూ సంగతేంటంటే పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ పేరుతొ ఒకప్పటి పీకే టీమ్ సభ్యులే ఈ ప్రాజెక్ట్ ను టేక్ అప్ చేసారని తెలుస్తోంది. సో పీకే కార్పొరేట్ సొల్యూషన్స్ పేరుతొ వీళ్ళు తమ గురువు ఐన ప్రశాంత్ కిషోర్ కే పంగనామాలు పెట్టారన్నమాట.