నారా లోకేష్ పై కామెంట్లు...రవికిరణ్ అరెస్ట్..

 

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ పై  సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. అలా ఫేస్ బుక్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన అమరావతి ప్రాంత వాసి ఇంటూరి రవికిరణ్ ను తుళ్లూరు పోలీసులు శంషాబాద్‌లో అదుపులోకి తీసకున్నట్టు తెలుస్తోంది. లోకేశ్ పై ఫేస్ బుక్ పోస్టులను చూసిన మండలి చైర్మన్ చక్రపాణి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామని తెలిపారు. గతంలోనూ కిరణ్, నారా లోకేష్ లక్ష్యంగా పలు పోస్టులను పెట్టాడని తెలిపారు.