భారత్ విజయం.. కుల్‌భూషణ్‌ మరణశిక్ష నిలిపివేత

 

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపిస్తూ తీర్పు వెలువరించింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది. 

2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2017 ఏప్రిల్‌లో కుల్‌భూషణ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.