ఇండోర్-పాట్నా రైలు ప్రమాదం.. ఐఎస్ఐ హస్తం..


ఇటీవల ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదం చోటుచేసుకన్న సంగతి తెలసిందే. ఈ ఘటనలో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. దీనికి ఉగ్రవాదులు కారణమని.. దీని వెనుక ఐఎస్ఐ హస్తం ఉందని తెలిసింది. ఇండో నేపాల్ సరిహద్దులో ముగ్గురు ఐఎస్ఐ ఏజంట్లు ఉమా శంకర్ పటేల్, మోతీలాల్ పాశ్వాల్, ముకేష్ యాదవ్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా ఎస్పీ బ్రిజ్ కిషోర్ మాట్లాడుతూ..  రెండు రైలు ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని.. రైల్వే ట్రాక్ కింద బాంబులు అమర్చినట్టు వీరు ఒప్పుకున్నారని తెలిపారు. వీరిని ఉత్తరప్రదేశ్, బీహార్ ఏటీఎస్ విభాగం అధికారులు, నేపాల్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారని, వీరి నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను, నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.