ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభ‌వించింది. సుమత్రా దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉద‌యం భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్రత‌ 6.5గా న‌మోదైంది. ఒక్క‌సారిగా భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు ప్రాణ‌భ‌యంతో ఇళ్ల‌లోంచి ప‌రుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ న‌ష్టం వివ‌రాలు తెలియాల్సి ఉంది. బెంగ్ కులు ప్రాంతానికి 73 కిమీ ల దూరంలో 35 కి.మీల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారీ తీవ్ర‌త‌తో ప్ర‌కంప‌న‌లు సంభ‌వించిన‌ప్ప‌టికీ ఎటువంటి సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌లేద‌ని యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో భూకంపం కార‌ణంగా సింగపూర్ లోని ప‌లు ప్రాంతాల్లో భూమి కంపించింది.