పాపులర్ రీజినల్ డిజిటల్ ఎంటర్‌టైనమెంట్ ఛానెల్‌గా తెలుగువన్

తెలుగువన్ మరోసారి జేజేలు అందుకుంది. డిజిటల్ మీడియా విప్లవానికి నాంది పలికిన తెలుగువన్, వినోదరంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ రోజు బెస్ట్ రీజినల్ డిజిటల్ ఎంటర్‌టైనర్‌గా అవార్డు అందుకొంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్లో ఈ అవార్డును బహుకరించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన తెలుగువన్.. షార్ట్‌ఫిల్మ్స్ నుంచి మ్యూజిక్ వీడియోల దాకా అన్ని వయసుల వారిని అలరించే వైవిధ్యమైన కార్యక్రమాలను రూపొందిస్తూ.. అత్యధిక వ్యూయర్‌షిప్‌తో దూసుకుపోతున్నందుకు గానూ ఈ అవార్డు దక్కింది.

 

ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ సహాయాలను అందిస్తూ ఎంతోమంది షార్ట్‌ఫిల్మ్ మేకర్స్‌కి సపోర్ట్‌గా నిలబడి.. వారి వెండితెర కలల్ని నిజం చేస్తోన్న తెలుగువన్ నుంచి ఇప్పటికే ఎందరో రచయితలు, దర్శకులు, నటులు వెండితెరకు పరిచయమై విజయాలను అందుకొని.. ప్రేక్షకుల ఆదరణతో మంచి స్థాయిలో ఉన్నారు. వైవిధ్యమైన అంశాలతో వీడియోలు రూపొందిస్తూ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి డిజిటల్ మీడియా ఛానెల్‌గా నిలిచిన తెలుగువన్ మరింత నిబద్ధతతో పనిచేస్తుందని.. ఈ అవార్డు అందించిన స్పూర్తితో మరింత కృషి చేస్తుందని తెలుపుతూ.. తెలుగువన్ ఛానెల్ అధినేత శ్రీ కంఠమనేని రవిశంకర్ ఈ సందర్భంగా తన హార్షాన్ని వ్యక్తం చేశారు.