మారని ఇండిగో.. మరోసారి బుక్

 

టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏం చేసినా అది తప్పులానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇండిగో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే పలు అభియోగాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్ లైన్స్ మరోసారి బుక్కయింది. అదేంటంటే.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం దిగిన ఒక మహిళ వీల్ చైర్ లోంచి జారి కింద పడిందట. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ తరువాత ఆమె ఫిర్యాదు చేయడంతో....  'ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా' చివాట్లు పెట్టింది. అయితే.. ఇందులో తమ సిబ్బంది తప్పు ఏమీ లేదని.. నేల మీద పరుచుకున్న గడ్డి వల్లే వీల్ చైర్ పక్కకు ఒరిగిందని దీంతో ప్రమాదం జరిగిందని.. ఇండిగో స్పోక్స్ పర్సన్ ఊర్వశి పరేఖ్ సంజాయిషీ చెప్పారు. సంస్థ తరపున బాధితురాలికి క్షమాపణ కూడా చెపుతున్నామని తెలిపారు. కాగా గతంలో స్టార్ ఒలంపియన్ పీవీ సింధు విషయంలో... ఆతరువాత మరో ప్యాసింజర్ ను స్టాఫ్ మెంబర్ కొట్టడం లాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడ ఈ ఘటనతో ఇండిగో ఎయిర్ లైన్స్ మరోసారి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.