అభిజిత్ బెనర్జీకి నోబెల్ పురస్కారం... అంతలోనే భారత్ పై సంచలన వ్యాఖ్యలు

 

అత్యున్నత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యారు. ప్రవాస భారతీయ ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీకి ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. అభిజిత్‌తోపాటు అతని భార్య ఎస్తర్ డఫ్లో కూడా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం కృషిచేసినందుకు అభిజిత్‌ బెనర్జీకి, అతని భార్య ఎస్తర్ డఫ్లోకి నోబెల్ పురస్కారం దక్కింది. అయితే, ఆర్ధికశాస్త్రంలో మొత్తం ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటించడంతో... మరో ఆర్ధికవేత్త మైఖేల్ క్రెఫర్‌తో కలిసి నోబెల్ పురస్కారాన్ని పంచుకోనున్నారు. ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకోబోతున్న అభిజిత్‌ బెనర్జీ... పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జన్మించారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని ఎంఐటీలో ఎకనమిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, పేదరిక నిర్మూలన కోసం కృషిచేస్తున్నారు.

అయితే, నోబెల్ పురస్కారం దక్కించుకున్న అభిజిత్ బెనర్జీ భారత ఆర్ధిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థ అస్ధిరంగా ఉందని, ప్రస్తుత వృద్ధిరేటును చూసిన తర్వాత, దాని పునరుజ్జీవనం గురించి కచ్చితంగా చెప్పలేమంటూ కీలక కామెంట్స్ చేశారు.