89 యాప్ లపై ఆర్మీ నిషేధం.. జాబితాలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ 

భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 89 యాప్ లను వినియోగించకూడదని సైనికులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్ లు కూడా ఉన్నాయి. ఈనెల 15లోగా ఈ యాప్ లన్నింటినీ తొలగించాలంటూ జాబితాను విడుదల చేసింది. గడువులోగా నిర్దేశించిన యాప్ లను తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సమాచార గోప్యత కారణంగా చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను ఇటీవల భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటికి మరో 30 యాప్ లను కలిపి మొత్తం 89 యాప్ లను మొబైళ్ల నుంచి తొలగించాల్సిందిగా సైనికులకు ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా చైనా కు సంబంధించిన యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. హనీట్రాప్, భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది.