టెస్టుల్లో హార్దిక్ తొలి సెంచ‌రీ..487 ప‌రుగుల‌కు టీమిండియా అలౌట్

టీమిండియా టీ20 స్పెష‌లిస్ట్ హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేసిన తొలి టెస్ట్ సీరిస్ లో అద‌ర‌గొడుతున్నాడు. టెస్టుల్లో తొలి సెంచ‌రి న‌మోదు చేసి రికార్డు సృష్టించాడు. శ్రీలంక‌-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న చివ‌రి టెస్టు రెండో రోజు మ్యాచ్ లో కేవలం 86 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 103 ప‌రుగులు చేశాడు. హాఫ్ సెంచ‌రీ మార్కును అందుకోవ‌డానికి అప‌సోపాలు ప‌డిన హార్ధిక్ అనంత‌రం త‌న విశ్వ‌రూపం చూపించాడు. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో గ్రౌండ్ ను హోరెత్తించాడు. మ‌రో 25 బంతుల్లోనే సెకండ్ ఫిఫ్టీ పూర్తి చేసి సెంచ‌రీ త‌న ఖాతాలో వేసుకున్నాడు. భోజ‌న విరామం అనంత‌రం సండ‌కాన్ బౌలింగ్ లో దిల్ రువాన్ కు క్యాచ్ ఇవ్వ‌డంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.